![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1033 లో.. మను నీ కొడుకు అయితే.. మరి నీ భర్త ఎవరు? నీకు పెళ్లైందా అని అనుపమని మహేంద్ర అడుగుతాడు. ఎంత దగ్గర వాళ్లైనా, ఎంత ఆత్మీయులైనా వాళ్ల దగ్గర అన్ని విషయాలను పంచుకోలేం.. కొన్ని కొన్ని నిజాలు మన గుండెల్లోనే సమాధి చేయాలి.. పది మంది ముందు అనుపమ వేరు.. మహేంద్ర ముందు ఉండే అనుపమ వేరు. నాలో ఉండే అనుపమ వేరు. నా గురించి నీకు అన్నీ తెలియాలని లేదు కదా అని అనుపమ అంటుంది. ఇన్నాళ్లూ దాచావంటే అర్ధం ఉంది.. ఇప్పుడు మాకు నిజం తెలిసింది కదా.. మను నీ కొడుకే అయితే ఇన్నాళ్లు ఎందుకు దూరం పెట్టావ్.. మీ ఇద్దరి మధ్యన గొడవ ఏంటని మహేంద్ర అడుగగా.. నేనిప్పుడేం చెప్పలేను మహేంద్రా అని అనుపమ అంటుంది.
చెప్పలేకపోవడమేంటి అనుపమా.. నువ్వు మను తల్లివి అయితే.. మను తండ్రి ఎవరు? అతనేం చేస్తుంటాడో చెప్పని మహేంద్ర మళ్ళీ అడుగుతాడు. ప్లీజ్ వదిలెయ్ మహేంద్రా అని అనుపమ అంటుంది. లేదు.. ఈరోజు నువ్వు నిజం చెప్పాల్సిందే.. నువ్వు ఆరోజు జగతికి డెలివరీ అయ్యే వరకూ ఉన్నావ్.. ఆ తరువాత కనిపించకుండా వెళ్లిపోయావ్.. ఆ తరువాత ఏమైందో నాకు తెలియాలి. మను తండ్రి ఎవరో నాకు తెలియాలని మహేంద్ర అంటాడు. నో.. నేను చెప్పలేను మహేంద్రా అని అనుపమ అంటుంది. ఎందుకు చెప్పవు.. అని మహేంద్ర గట్టిగా నిలదీయడంతో.. ఇంతలో ఏంజిల్ ఎంట్రీ ఇస్తుంది. ఏంటి సార్.. మా అత్తయ్యని ఏదో అడుగుతున్నట్టు ఉన్నారు. అంత ఇబ్బంది పెడతున్నారేంటని ఏంజిల్ అంటుంది. ఇబ్బంది కాదమ్మా.. నిజం ఏంటో తెలియాలి కదా అని మహేంద్ర అంటాడు. మా అత్తయ్య గతమేంటో తెలుసుకోవాలని నాకూ ఉంది. కానీ అది తెలుస్తుందనే ఆశ నాకు కనిపించడం లేదు. అసలు నాకు మేనత్త ఉంది.. మా డాడీకి చెల్లెలు ఉంది.. మా తాతయ్యకి ఇంకో వారసురాలు ఉందని తెలుసుకోవడానికే నాకు పాతికేళ్లు పట్టింది. తనకో కొడుకు ఉన్నాడని ఇదిగో ఇప్పుడే తెలుస్తుంది.. మా అత్తయ్య జీవితంలో ప్రతిదీ రహస్యమే.. నాకు తెలిసీ మీరు ఎంత అడిగినా సమాధానం చెప్పదు. నేను అడిగినా చెప్పదు. ఆమె ఇప్పుడు చెప్పే పరిస్థితిలో లేదు. అందరికీ చెప్పుకునేదే అయితే చెప్పేదే కదా.. ఎవరికీ చెప్పుకోని సమస్య అయ్యి ఉంటుందని ఏంజిల్ అంటుంది. ఆ మాటతో మహేంద్ర.. ఇలా నిజాన్ని దాచేసి తనలో తాను బాధపడుతూ ఉంటే ఎలా.. ఆ నిజాన్ని మాతో చెప్తే మేమ్ ఏదొక పరిష్కారం ఆలోచిస్తాం కదా.. నా మాట విను అనుపమా.. అసలేం జరిగింది? నువ్వు అబద్దం చెప్పవు. కానీ పెళ్లి కాలేదని చెప్పావ్.. మను తండ్రి ఎవరని మహేంద్ర మళ్లీ అడుగుతాడు. చూడు మహేంద్రా.. నువ్వు ఎన్నిసార్లు అడిగిన నేను చెప్పను.. నన్ను విసిగించకు ప్లీజ్ అని అనుపమ చేతులెత్తి మొక్కుతుంది. దాంతో ఏంజిల్.. ‘సర్ ప్లీజ్.. అత్తయ్యని రెస్ట్ తీసుకోనీయండి.ఈ విషయం వదిలేయండి.. నిజం తెలియాల్సిన రోజు తెలుస్తుంది.. ఆ రోజు కోసం ఎదురుచూద్దామని ఏంజిల్ అంటుంది. దాంతో మహేంద్ర అక్కడ నుంచి వెళ్లిపోబోతుంటాడు. ఇంతలో అనుపమ పిలిచి.. ఈ ప్రశ్న నన్ను అడిగితే అడిగావ్ కానీ మనుని మాత్రం నీ తండ్రి ఎవరని అడక్కని అంటుంది. దాంతో మహేంద్ర.. సరే అన్నట్టుగా తలాడిస్తాడు. ఇక వసుధార అయితే మను కాలేజ్‌కి రాకపోవడంతో అతని గురించే ఆలోచిస్తూ ఫోన్ చేస్తుంది.
మను కాల్ లిఫ్ట్ చేయడంతో.. ఏంటి మను గారూ కాలేజ్‌కి వస్తున్నారా అని అడుగుతుంది. ఎలా వస్తాను మేడమ్.. కాలేజ్‌లో అందరి ముందు ఘోరంగా అవమానించి కొట్టి పంపేశారని మను అనగానే.. ఆ తప్పు మీరు చేయలేదు కదా.. ఇప్పుడు మీరు రావచ్చు కదా అని వసుధార అంటుంది. ఆ మాట మీరు అనడం కంటే అనుపమ మేడమ్ గారు అంటే బాగుంటుందేమో అని మను అంటాడు. మేడమ్ గారు ఏదో ఆవేశంలో అన్నారు.. మీ తప్పు లేదని తెలిసింది కదా అని కాసేపు మాట్లాడుతుంది వసుధార. మరోవైపు శైలేంద్ర, రాజీవ్‌లు రోడ్‌పై మాట్లాడుకుంటు ఉండగా.. వారిదగ్గరికి మను ఆవేశంగా వస్తాడు. కారు దిగి.. గన్ తీసి శైలేంద్ర తలకి గురిపెట్టి.. రేయ్.. మా అమ్మమీద ఎటాక్ చేసింది ఎవరని మను అడుగుతాడు. దాంతో రాజీవ్.. చాలా కూల్‌గా.. అసలు మీ అమ్మ ఎవరు భయ్యా అని అంటాడు. రేయ్ నాటకాలు ఆడొద్దు.. మా అమ్మపై ఎటాక్ చేసింది ఎవరని మను అరుస్తాడు. అరే.. అడుగుతున్నాను కదా భయ్యా.. మీ అమ్మ ఎవరని రాజీవ్ అంటాడు. అనుపమ గారు ఉన్నారు కదా.. ఆవిడే మను తల్లి, ఆవిడపై ఎవరో ఎటాక్ చేశారని అంటాడు. నాకైతే ఇప్పుడే తెలిసిందని రాజీవ్ అంటాడు. దేవుడి దయవల్ల అమ్మ డిశ్చార్జ్ అయింది కాబట్టి మీరు బ్రతికిపోయారు. లేదంటే తలకిందులుగా వేలాడదీసేవాడిని అని మను అనగానే.. నువ్వు తలకిందులుగా వేలాడదీస్తావో.. నిటారుగా వేలాడదీస్తావో నీ ఇష్టం భయ్యా అని రాజీవ్ తీసిపారేస్తాడు. చూస్తా.. మీ సంగతి చూస్తా.. నా ఫోకస్ మొత్తం ఇక నుంచి మీపైనే మను అంటాడు. ఆ మాటతో రాజీవ్, శైలేంద్రలు ఒకేసారి.. డోంట్ కేర్ భయ్యా అని అంటారు. ఈ వార్నింగ్ మీపై నాకు డౌట్ వచ్చినందుకు మాత్రమే.. మీరే ఇది చేశారని కన్ఫమ్ అయితే అదే రోజు మీ డేట్ ఆఫ్ డెత్ ఫిక్స్ అయిపోతుందని శైలేంద్ర, రాజీవ్‌లకు మను వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. వీడికి డౌట్ వచ్చింది భయ్యా.. నిజం తెలిస్తే మనల్ని లేపేసేట్టు ఉన్నాడని రాజీవ్ అనగానే.. అప్పటివరకు వాడికి అవకాశం ఎందుకు ఇస్తాం.. వాడికంటే ముందే వాడిని ఫినిష్ చేస్తా.. వాడికి వార్నింగ్‌లు ఇవ్వడం మాత్రమే వచ్చు.. నాకు లేపేయడము వచ్చు అని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |